24, జులై 2025, గురువారం

కేటీఆర్‌కు మ‌న‌మిచ్చే పుట్టిన‌రోజు కానుక స్థానిక సంస్థ‌ల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిపించుకోవ‌డ‌మే

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను అంబర్‌పేట పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు  అంబర్‌పేట డివిజన్ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు  కోదాడ 


లో స్థానిక సంస్థ‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చూపించి మెజార్టీ స్థానాలు గెలిపించుకోవ‌డ‌మే కేటీఆర్‌కు తామిచ్చే పుట్టిన‌రోజు కానుక అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ అన్నారు.అమెరికాలోని ఆస్టిన్‌లో బీఆర్ఎస్ నేత‌, కోదాడ వాసి జలగం సుధీర్ నేతృత్వంలో కేటీఆర్ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో కేటీఆర్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

21, మే 2025, బుధవారం

వైసీపీని వీడడానికి మరో ఎంపీ సిద్ధం..?

 వైసీపీకి కష్టాలు అన్నీ ఒక్క మారు చుట్టుముడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తామని వైసీపీ అధినాయకత్వం అనుకోవచ్చు కానీ చేతిలో నాలుగేళ్ళ పాటు అధికారం ఉన్న టీడీపీ కూటమి ఈ చాన్స్ ఎందుకు వదులుకుంటుంది. తప్పకుండా వైసీపీకి సినిమా చూపించేస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి మహానాడు జగన్ సొంత ఇలాకా కడపలో ఏర్పాటు చేస్తున్నారు మరి అక్కడ మహానాడు అంటే ఆ వ్యూహం ఆ లెక్కలూ వేరే లెవెల్ లో ఉండాలి కదా. పైగా వైసీపీ కూసాలు కదిలిపోవాలి కదా. అది ఎలా జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బిగ్ షాట్స్ ని టీడీపీలోకి తీసుకుని వచ్చినపుడే అంటున్నారు .ఆ విధంగా భారీ స్కెచ్ గీసి మరీ వైసీపీని దెబ్బ కొట్టే పనిలో టీడీపీ అధినాయకత్వం ఉంది అని అంటున్నారు.

దాంతో మహానాడులో ఎవరూ ఊహించని విధంగా పెద్ద నాయకులే సైకిలెక్కుతారు అని అంటున్నారు. ఆ విధంగా చేరే వారిలో రాజ్యసభకు చెందిన ఒక ఎంపీ కూడా ఉంటారని అంటున్నారు. మరి ఆయన ఎవరు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది వైసీపీకి 2024లో అధికారం కోల్పోయేనాటికి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అందులో నలుగురు ఇప్పటికే పార్టీని వీడిపోయారు. ఇక మిగిలిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాధరెడ్డి, ఆళ్ళ అయోధ్యా రామిరెడ్డి, పరిమళ్ నత్వనీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు అన్నదే చర్చగా ఉంది. ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ తో ముగుస్తోంది. వారు పార్టీ మారినా రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ఆరు నెలల మించి కొత్త వారికి పదవి ఉండదు, వారి జోలికి ఎవరూ వెళ్ళరు, వారు కూడా ఈ సమయంలో రారు అని అంటున్నారు. అంటే మరో నలుగురు విషయంలోనే చర్చలు మళ్ళుతున్నాయి.

ఆ నలుగురిలో వైవీ సుబ్బారెడ్డి జగన్ సొంత బాబాయ్,ఆయన్ని పక్కన పెడితే నిరంజన్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు, సొంత లాయర్, ఇక ఆయనను కూడా కాదు అనుకుంటే ఇద్దరు పేర్ల మధ్యనే రాజకీయ చర్చ అంతా సాగుతోంది. ఆ ఇద్దరే గొల్ల బాబూరావు, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి. ఇందులో ఒకరు ఉత్తరాంధ్రా వాసి, విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు, రెండవవారు కడప జిల్లాకు చెందిన మేడ రఘునాధరెడ్డి. ఈ ఇద్దరి పదవీ కాలం 2030 ఏప్రిల్ 1 వరకూ ఉంది. అంటే కచ్చితంగా అయిదేళ్ళ పాటు పదవి ఉంది అన్న మాట. ఈ ఇద్దరి విషయంలోనే రాజకీయంగా అంతా చర్చిస్తున్నారు. గొల్ల బాబూరావు పేరు ఆ మధ్య వినిపించినా తనకు రాజకీయ జన్మ ఇచ్చిన వైఎస్సార్ కుటుంబాన్ని వీడేది లేదని చెప్పారు. మేడా మల్లికార్జున రెడ్డి కూడా గతంలోనే పార్టీని వీడను అని గట్టిగా చెప్పారు కానీ ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. 

అయితే వైసీపీ నుంచి బయటకు వస్తే తాము రాజీనామా చేసిన ఎంపీ సీటు తిరిగి తమకే ఇవ్వాలని ఒక కండిషన్ మీద మాత్రమే ఎవరు పదవి వదులుకున్నా చెబుతున్నారు అని అంటున్నారు. అంటే తాము పార్టీ మారుతాము కానీ ఎంపీ సీటు మళ్ళీ మాకే ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ఆ షరతుని అటు టీడీపీ కానీ బీజేపీ కానీ అంగీకరిస్తే ఆయా పార్టీల తరఫున వీరు తిరిగి రాజ్యసభకు వెళ్ళే చాన్స్ ఉంది అంటున్నారు ఇప్పటికి అయితే టీడీపీ అధినాయకత్వం నుంచి ఒక హామీ తీసుకునే సదరు ఎంపీ వైసీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.  మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా రాజ్యసభ ఎంపీ ఒకరు సైకిలెక్కుతారని దీనిని సంబంధిచిన లాంచనాలు అన్నీ పూర్తి అయ్యాయని అంటున్నారు. ఎవరా ఎంపీ ఏమా కధ అంటే మహనాడు వరకూ ఆగాల్సిందే అంటున్నారు.

అందరి చూపు లోకేష్ వైపే…!


తెలుగు దేశం పార్టీ స్థాపించి ఈ ఏడాది మార్చి నాటికి 43 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 29 మార్చి 1982 లో నందమూరి తారక రామారావు చేత స్థాపించబడిన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు మరో తరం నాయకత్వ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్ మనవడిగా, నారా చంద్రబాబు తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నారా లోకేష్ 2019 లో ఓటమితో కాస్త తడబడినా, వెంటనే తేరుకుని తన ఓటమికి గల కారణాలను అన్వేషించారు, అలాగే కొన్ని దశాబ్దాలుగా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేలకపోవడానికి గల వాస్తవాలను శోధించారు.   


ఇక 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అత్యంత గడ్డుకాలం చూసింది. పార్టీ కార్యకర్తలే కాదు పార్టీ ముఖ్య నాయకులు కూడా స్వేచ్ఛగా, ప్రజా స్వామ్య బద్దంగా రాష్ట్రంలో రాజకీయం చేసే పరిస్థితి లేకపోయింది. పార్టీ నాయకుల మీద కేసులు, అరెస్టులు, పార్టీ కార్యాలయాల మీద దాడులు, నడి రోడ్ల మీద టీడీపీ నేతల మీద వైసీపీ మూకల అరాచకాలు అన్ని కలిసి నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ పార్టీని ఆలోచనలో పడేసేలా చేసాయి.   అటువంటి కీలక సమయంలో ‘యువగళం’ పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన నారా లోకేష్ తనను తానూ తెలుసుకుంటూ, ప్రజలకు పార్టీ క్యాడర్ కు దగ్గరవుతూ, పార్టీ నాయకులలో వైసీపీ పై పోరాటానికి ఒక ఆత్మ స్తైర్యాన్ని నింపారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు తో టీడీపీ పార్టీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ, టీడీపీ పై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించింది. అటు వంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని అటు కుటుంబానికి, ఇటు పార్టీకి పెద్దదిక్కుగా నిలిచి ‘నేనున్నాను’ అనే మనోధైర్యాన్ని తెలుగు తమ్ముళ్లలో నింపారు లోకేష్. 


ఇటు రాష్ట్రంలో కలిసి వచ్చిన జనసేన పార్టీని కలుపుకుంటూ, అటు తండ్రిని బయటకు తీసుకురావడానికి హస్తినలో చక్కబెట్టాల్సిన పరిస్థితులన్నిటిని ఒంటి చేతిమీద లాక్కొచ్చి వైసీపీ కుట్ర రాజకీయాలను భగ్నం చేసి ఓడిన చోటే సుమారు 90 వేలపైచిలుకు ఓట్లతో బారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాదయాత్రతో తనను తానూ ఒక నాయకుడిగా మలచుకున్న లోకేష్, బాబు అరెస్టు తో పార్టీ భవిష్యత్ నాయకుడిగా టీడీపీ శ్రేణుల నమ్మకాన్ని పొందారు. ఇక 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తన తల్లికి జరిగిన పరాభవానికి, తన తండ్రికి జరిగిన అవమానానికి, పార్టీ క్యాడర్ కు జరిగిన అన్యాయానికి, నాయకులకు జరగవలసిన న్యాయానికి సరైన నిర్వచనం చెప్పేలా ‘రెడ్ బుక్’ తో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు దిక్సూచి గా నిలిచారు. అయితే ఈనెల కడపలో 27 నుంచి 29 వరకు జరగబోయే టీడీపీ మహానాడు వేడుకలో పార్టీలో నారా లోకేష్ పదవోన్నతి పైనే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. ఇప్పటికే టీడీపీ నాయకులు, క్యాడర్ టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ అంటూ బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ మహానాడు లో పార్టీ అధినేతగా చంద్రబాబు, లోకేష్ కు ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.



 

13, మే 2025, మంగళవారం

భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులు


 భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులు  ప్రపంచ అందాల భామలు ఔట్‌డోర్‌ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుపడుతున్నారు. వందలాది కిలో మీటర్ల ప్రయాణం వారికి చికాకు తెప్పిస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. మండుటెండల్లో వందలాది కిలో మీటర్ల ప్రయాణానికి వాళ్లంతా వెనకడుగు వేస్తున్నారు. టూర్లకు తాము రాబోమని నిర్వాహకులకు చెప్పేస్తున్నారని ఓ అధికారి తెలిపారు. అందుకే మొదట్లో కంటెస్టెంట్లందరితో పర్యాటక టూర్‌కు ప్రణాళికలు చేసిన అధికారులు.. ఇప్పుడు వాళ్ల అనాసక్తి కారణంగా కొందరిని మాత్రమే టూర్‌కు తీసుకెళుతుండటం విశేషం. సోమవారం 120 మందిలో 22 మందిని మాత్రమే నాగార్జున సాగర్‌ బుద్దవనం టూర్‌కు తీసుకెళ్లారు., పోటీలకు సంబంధించిన రౌండ్లు 22న మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలే ఉంటుంది. 23న హెడ్‌ టూ హెడ్‌ చాలెంజ్‌ ఫినాలే, 24న ఫ్యాషన్‌ ఫినాలే ఉంటుంది. ఈ స్వల్ప కాలంలో వాళ్లంతా టైటిల్‌ దక్కించుకోవడానికి తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది  31న హైటెక్స్‌లో ఫైనల్‌ పోటీలు జరుగుతాయి. ప్రపంచ సుందరీ ఎవరో ఆ రోజే తెలిసిపోతుంది


12, మే 2025, సోమవారం

టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లీ

 టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లీ తన తదుపరి ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు విరాట్ కోహ్లీ అని, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన అధ్యాయాన్ని. ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత గల ఆటగాడిగా . కోహ్లీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది



15, డిసెంబర్ 2023, శుక్రవారం

నా జీవితంలో మంచి, చెడులు చూశా..కంట తడిపెట్టిస్తోంది...సొనాలి బింద్రే



సొనాలి బింద్రే. కేన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు.. ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. 'జీవితంలో చెడు రోజులు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి' అని వ్యాఖ్యానించింది.

 
ఆమె తాజాగా చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే, 'గత కొన్ని నెలలుగా నా జీవితంలో మంచి, చెడులు చూశా. వ్యక్తిగా ఎంతో బలహీన పడిపోయా. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తి సరిపోవడం లేదు. ఇది కూడా జీవితంలో ఓ భాగమనిపిస్తుంది. అయితే శారీరకంగా ప్రారంభమైన నొప్పి మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు నొప్పి భరించడం కష్టంగా అనిపించింది. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. ఆ టైమ్‌లో కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసుకుంటున్న భావన కలుగుతోంది. నొప్పిని భరిస్తూ ఏడ్చాను. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా.
 
 ఇలాంటి చెడు రోజులు జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండాలి. మనకేం అవుతుందో, ఎటువైపు వెళ్తున్నామో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. భావోద్వేగానికి గురికావడం తప్పుకాదు. ఆ తర్వాత దాన్ని గుర్తించాలి. జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్తలు అవసరం. 
 
ప్రస్తుతం చిక్సిత కొనసాగుతుంది. నా రూపు కొంత చక్కగా మారింది. త్వరలోనే ఇంటికి వచ్చేస్తా. ఇదీ ఓ పరీక్ష. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి' అంటూ సోనాలి భావోద్వేగానికి గురవుతూ ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు. సోనాలి పోస్ట్‌కు నెటిజన్లు అంతే భావోద్వేగంగా స్పందిస్తూ ఆమెకు ధైర్యాన్నివ్వడం విశేషం. 

16, నవంబర్ 2023, గురువారం

రామ్‌చ‌ర‌ణ్‌తో సాయిప‌ల్ల‌వి


 గ్లామ‌ర్ హీరోయిన్ క్యారెక్ట‌ర్లు. అంతేకాకుండా, సాంగ్స్‌ల‌లో రోమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అస్స‌లు అంగీకరించ‌దు సాయిపల్ల‌వి. ఇలాంటి విష‌యాల‌లో పెద్ద‌పెద్ద స్టార్స్‌ను సైతం ప‌క్కన ప‌డేస్తుంది. గతంలో మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరులో అవకాశం వ‌చ్చింది. అయితే, ఈ సినిమా కథ విని వెంటనే రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. దాంతో సాయి పల్లవి ఎంతో స్పెషల్ అనే పేరును సంపాదించుకుంది. ఆమె దగ్గరకు క‌థ‌లు చెప్పేందుకు వెళ్లిన ద‌ర్శ‌కులు సైతం జాగ్ర‌త్త‌గా ఉంటున్నార‌ని స‌మాచారం. కేవ‌లం మంచి క‌థ‌లు హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల‌ను మాత్ర‌మే ఆమె ఎంచుకుంటారు. అయితే తాజాగా సాయి పల్లవి రామ్ చరణ్ తో జోడీ కట్టబోతుంది అనే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

ఫిదా సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది న‌టి సాయిప‌ల్ల‌వి. ఆ త‌ర్వాత తెలుగులోఎన్నో సినిమాల్లో న‌టించింది. త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌, అందంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు యాక్టింగ్ ఉండే స్కోప్ సినిమాల‌నే త‌ను ఒప్ప‌కుంటుంది. గ్లామ‌ర్‌కు, ఎక్స్‌పోజింగ్ కాకుండా న‌ట‌నకే ప్రాధాన్య‌మిచ్చే న‌టి సాయిప‌ల్ల‌వి. అందుకే చాలా త‌క్కువ సినిమాల్లో ఆమె న‌టిస్తుంటారు. అయితే, ఇప్ప‌డు తాజాగా రామ్‌చ‌ర‌ణ్‌తో సాయిప‌ల్ల‌వి జోడి క‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త కాస్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

కేటీఆర్‌కు మ‌న‌మిచ్చే పుట్టిన‌రోజు కానుక స్థానిక సంస్థ‌ల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిపించుకోవ‌డ‌మే

    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను అంబర్‌పేట పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు    అంబర్‌పేట డివిజన్ పటేల్ నగర్...